Wednesday, January 11, 2012

ఒంటరితనం


ప్రతిసారి ఓడిపోతూనే వున్నాను..కాకపోతే ఓడిపోవడంలో కొత్తదనం లేదు..ఓడిపోవడం ఒంటరివాడిని కావడం అంతే.ఒకలా ఓడిపోవడం కూడా నాకు ఓదార్పు నిస్తుంది..

Tuesday, November 24, 2009

కనులలో కల్పన

కళ్ళు కళల్నికంటుంది.కల కళల్ని కనువిందు చేస్తుంది.కలలుకన్న నీకళ్ళని కళ్ళు కవ్విస్తాయి మెరిపిస్తాయి నీదరి చేరుస్తాయి.అవి నన్ను మైమరపిస్తున్నాయి

Thursday, November 5, 2009

కలల స్వప్నమా..

చిగురించే ఆశల చిరకాలం గుర్తుండిపోయే
చిరునవ్వుల చిహ్నమా ..
నా చిన్ని హృదయంలో నీపైన
ఆశని ఆవిరిని చేసి నన్ను వీడి
వెర్రివాడిని చేశావా కలల స్వప్నమా..

Monday, November 2, 2009

ప్రేమికులరోజు

అమృత వర్షాన్ని కురిపిస్తూ
అమూల్య సందేశాన్ని వినిపించే అదృష్టమైన రోజు
ఎర్రగులాబిలతో ఎదురుచూస్తూ
కళ్ళు కాయలుగా మారే పువ్వుల పండుగ రోజు
సప్త శిఖరాలనైన దాటుకొని
మనసువిప్పి ఏకాంతంగా చేరువయ్యే ప్రశాంతమైన రోజు
ఎక్కడో వుంటూ మనోహరమైన కాంతితో
ప్రేమలేఖలు పంపే సుమధురమైన రోజు
రెండు హృదయాలు ఒక్కటిగాచేరి
ఎంత కాలమైన మాట్లాడుకునే తనివి తీరని రోజు
ముద్దుముద్దు మాటలతో మురిపిస్తూ
చూపులతోనే సమయాన్ని గడిపే ముచ్చటైన రోజు
జీవిత నిర్ణయానికి ఒక్కసారి
నిర్ణయం తీసుకునే ఆకరిక్షణం రోజు
మనసులో మాటను ఏవిధంగా చెప్పాలో తెలియక
సతమతమయ్యి మూగబోయిన మనసుని మాట్లాడించే
ఆదర్శవంతమైన రోజు
ఎన్నో ప్రేమపక్షులు ఆకాశానికి ఎగురుతుంటే మరికొన్ని
ప్రేమపక్షులు మాత్రం మధ్యలోనే రెక్కలు విరిగి నేలకురాలే
దుఖమైన రోజు ..ఈ రోజు ప్రేమికులరోజు..!.

Sunday, November 1, 2009

తల్లి ప్రేమా !...

.
మొగ్గ తన తల్లి చెట్టుకు చెబుతుంది.
అమ్మా! నేను పువ్వులా విచ్చుకోనా, వాడిపోనా అని,
అప్పుడు చెట్టు అంటుంది తన బిడ్డతో ,నీవు
ఈ మొగ్గ వయస్సులోనే అమాయకంగా అందంగా వుంటావు,
ఎప్పుడైతే నీవు పువ్వులా వికసించి విరభోస్తావో అప్పుడు,
నిన్ను కన్న నీతల్లిని మరచిపోయి నీలో నీకు,
స్వార్థం, అసూయా ,ఆకర్షణ,వంటి ఆలోచనలు కలిగి,
ప్రకృతికి లొంగిపోతావు..ఆ ప్రకృతి నిన్ను
వాడిపోయేలా చేస్తుంది..అలా నా బిడ్డ పువ్వులా,
వికసించి వాడిపోవడం నాకు ఇష్టం లేదు..నీవు
ఎప్పుడు వాడిపోకుండా మొగ్గలా వుండాలనే నా కోరిక ! .

Wednesday, October 28, 2009

నీవాడనవుతా

నీ నిశ్శబ్దమే చిరునవ్వైతే .....
నేనే నింగి నేలనై నీకు
నీడనవుతూ నీవాడనవుతా!

Tuesday, October 27, 2009

ఈ క్షణం

నీ మనసుతో మాట్లాడిన ఈ క్షణం....
నా జీవితానికి మరపురాని
సిరిమువ్వల పర్వదినం..