Sunday, November 1, 2009

తల్లి ప్రేమా !...

.
మొగ్గ తన తల్లి చెట్టుకు చెబుతుంది.
అమ్మా! నేను పువ్వులా విచ్చుకోనా, వాడిపోనా అని,
అప్పుడు చెట్టు అంటుంది తన బిడ్డతో ,నీవు
ఈ మొగ్గ వయస్సులోనే అమాయకంగా అందంగా వుంటావు,
ఎప్పుడైతే నీవు పువ్వులా వికసించి విరభోస్తావో అప్పుడు,
నిన్ను కన్న నీతల్లిని మరచిపోయి నీలో నీకు,
స్వార్థం, అసూయా ,ఆకర్షణ,వంటి ఆలోచనలు కలిగి,
ప్రకృతికి లొంగిపోతావు..ఆ ప్రకృతి నిన్ను
వాడిపోయేలా చేస్తుంది..అలా నా బిడ్డ పువ్వులా,
వికసించి వాడిపోవడం నాకు ఇష్టం లేదు..నీవు
ఎప్పుడు వాడిపోకుండా మొగ్గలా వుండాలనే నా కోరిక ! .

No comments:

Post a Comment